Telugu bible quiz questions and answers from acts of the Apostles(QUIZ-1)
Telugu bible Trivia on Acts of apostles
1➤ అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని రచించినది ఎవరు?
2➤ ఈ పుస్తకాన్ని లూకా ఎవరికి అంకితమిచ్చాడు?
3➤ పునరుత్థానం తరువాత యేసు ఈ భూమిమీద ఎన్ని రోజులు ఉన్నాడు?
4➤ యేసు ఆరోహణ సమయంలో ప్రభువు దూతలు శిష్యులను ఎలా సంబో ధించారు?
5➤ ఎక్కడనుండి యేసు పరలోకానికి ఆరోహణమైనాడు?
6➤ యేసు పునరుత్థానం తరువాత ఆయన శిష్యులు ఎక్కడికి తిరిగి వెళ్ళారు?
7➤ యేసు పునరుత్థానం తరువాత ప్రార్థన సమావేశానికి హాజరైన స్త్రీ పేరు ప్రస్తావించబడింది. ఆ స్త్రీ ఎవరు?
8➤ ద్రోహంవలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలాన్ని కొన్నదెవరు?
9➤ తలక్రిందులుగా పడి నడిమికి బద్ధలైనందున ఎవరి ప్రేగులు బయట కొచ్చాయి?
10➤ యూదా కొన్న పొలానికి ఇవ్వబడిన పేరు ఏమిటి?
11➤ “అట్టమ' అనగా ఏమిటి?
12➤ ఇస్కరియోతు యూదా స్థానం వేరొకడు తీసికొంటారని ఎవరు ప్రవచించారు?
13➤ ఇస్కరియోతు యూదా స్థానంలో ప్రతిపాదించబడిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?
14➤ యోసేపుకుగల ఇతర పేర్లు ఏమిటి?
15➤ ఇస్కరియోతు యూదా స్థానంలో ఎవరు ఎన్నుకోబడ్డారు?
16➤ యాభైవ రోజు ఏవిధంగా పేర్కొనబడింది?
17➤ ప్రార్థిస్తున్న ప్రజలమీదికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు?
18➤ పెంతెకోస్తు నాడు ప్రసంగించిందెవరు?
19➤ పరిశుద్ధాత్మ రాకడను గురించి ప్రవచించిన ప్రవక్త పేరు ఏమిటి?
20➤ యేసు శరీరం కుళ్ళిపోదని ఎవరు ప్రవచించారు?
21➤ పేతురు మొదటి ప్రసంగంద్వారా ఎంతమంది బాప్తిస్మం పొందుకొన్నారు?
22➤ మొదటి క్రైస్తవులు ఎక్కడ కూడుకొనేవారు?
23➤ రక్షణ పొందుతున్న వారిని అనుదినం సంఘంలో చేర్చింది ఎవరు?
24➤ పేతురు, యోహానులద్వారా స్వస్థపడిన కుంటివాడు ఎక్కడ కూర్చొన్నాడు?
25➤ 'వెండి బంగారములు నాయొద్ద లేవు' అని ఎవరు చెప్పారు?
26➤ ఏ మంటపంలో పేతురు ప్రజలకు బోధించాడు?
27➤ ప్రభువు సముఖంనుండి ఏమి వస్తుంది?
28➤ మనుష్యులు రక్షించబడే ఏకైక నామం ఏమిటి?
29➤ 'బర్నబా' అనే పేరుకు అర్థం ఏమిటి?
30➤ బర్నబా అని ఎవరు అతనికి పేరు పెట్టారు?
31➤ బర్నబాకు గల మరో పేరు ఏమిటి?
32➤ బర్నబా ఏ ప్రాంతానికి చెందినవాడు?
33➤ తన భూమిని అమ్మి దాని వెలను తెచ్చి అపొస్తలుల పాదాలవద్ద పెట్టిందెవరు?
34➤ అపొస్తలుల పాదాలవద్ద డబ్బును పెట్టడానికి తమ భూమిని అమ్మిన మరొక కుటుంబం ఏది?
35➤ భూమిని అమ్మిన వెలలో కొంత డబ్బును మాత్రమే తెచ్చినదెవరు?
36➤ పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధమాడినందుకు చనిపోయిన కుటుంబం ఏది?
37➤ పేతురు పాదాలవద్ద పడి చనిపోయిన స్త్రీ పేరు ఏమిటి?
38➤ చెరసాలద్వారాలను తెరచి దూత బయటికి తెచ్చిన అపొస్తలుల పేర్లు ఏమిటి?
39➤ సమస్త ప్రజలవలన ఘనత పొందిన ధర్మశాస్తోపదేశకుడు ఎవరు?
40➤ తానొక గొప్పవాడినని చెప్పుకొన్నదెవరు?
41➤ ఎవరిని వెంబడించిన ప్రజలు చెదిరి వ్యర్ధులైనారు?
42➤ విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వ్యక్తి ఎవరు?
43➤ భోజన బల్లలవద్ద పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన మత ప్రవిష్టుడు ఎవరు?
44➤ నీకొలాసు ఏ ప్రాంతానికి చెందినవాడు?
45➤ కృపతోను, బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహాత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేసినదెవరు?
46➤ ఏసమాజ మందిరాలనుండి వచ్చిన ప్రజలు సైఫనుతో తర్కించి వాదించారు?
47➤ ఎవరి ముఖం దేవదూత ముఖంవలె కనబడింది?
48➤ హారానులో కాపురముండక మునుపు అబ్రాహాము ఎక్కడ జీవించాడు?
49➤ మెసొపొతమియ ప్రాంతం ఏ దేశంలో ఉంది?
50➤ ఎవరి కుమారులనుండి అబ్రాహాము సమాధిని కొన్నాడు?
51➤ మాటలయందు, కార్యములయందు ప్రవీణుడైన వ్యక్తి ఎవరు?
52➤ తన సహోదరులను చూడవలెననే బుద్ధి ఎవరి హృదయంలో పుట్టింది?
53➤ ఏ దేవత యొక్క నక్షత్రాన్ని ఇశ్రాయేలీయులు మోసుకొనిపోయారు?
54➤ పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరి చూచింది ఎవరు?
55➤ ఆకాశం తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుట చూసిందెవరు?
56➤ వస్త్రాలవద్ద సాక్షిగా ఉన్న దెవరు?
57➤ మొదటి క్రైస్తవ హతసాక్షి ఎవరు?
58➤ స్తెఫను చావుకు సమ్మతించింది ఎవరు?
59➤ సంఘాన్ని పాడుచేసింది ఎవరు?
60➤ సమరయ పట్టణంలో క్రీస్తును గురించి ప్రకటించినదెవరు?
61➤ సమరయ పట్టణంలో గారడీచేసి ఆ పట్టణస్థులను విభ్రాంతిపరచినదెవరు?
62➤ సమరయ పట్టణంలో బాప్తిస్మం తీసుకొన్న గారడివాడు ఎవరు?
63➤ కైసరయలో ఉన్న శతాధిపతి ఎవరు?
64➤ ఏపటాలంలో కొర్నేలీ అనే శతాధిపతి ఉన్నాడు?
65➤ దేవునియందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఎల్లప్పుడు దేవునికి ప్రార్థించిన శతాధిపతి ఎవరు?
66➤ ఎవరి ప్రార్థనలు, ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి?
67➤ దూతద్వారా కొర్నేలికి పరిచయం చేయబడిన అపొస్తలుడు ఎవరు?
68➤ ఎవరి ఇంటికి వెళ్లమని కొర్నేలీకి దూత చెప్పాడు?
69➤ పగలు ఇంచుమించు పన్నెండు గంటల సమయంలో ప్రార్థించడానికి పేతురు ఎక్కడికి వెళ్ళాడు?
70➤ ఆకాశంనుండి నాలుగు చెంగులు పట్టి దింపబడిన దుప్పటివంటి పాత్రను గురించిన దర్శనం ఎవరికి కలిగింది?
71➤ నీవు లేచి చంపుకొని తినుమని చెప్పిన దేవుని స్వరాన్ని ఎవరు విన్నారు?
72➤ పేతురును పిలిచి ఆయన మాటలను వినాలని ఆశించినదెవరు?
73➤ దేవుని వాక్యాన్ని వినడానికి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిచినదెవరు?
74➤ పేతురు పాదాలపై పడి అతన్ని ఆరాధించినదెవరు?
75➤ దేవుని వాక్యాన్ని విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్ముడు ఎక్కడ దిగి వచ్చాడు?
76➤ 'లేచి నిలువు, నేనుకూడ నరుడనే' అని ఎవరితో పేతురు చెప్పాడు?
77➤ పేతురు పరవశుడైనప్పుడు ఎక్కడ ఉన్నాడు?
78➤ దేవుడు అన్య జనులకు జీవార్ధమైనదేది దయచేశాడు?
79➤ పరిచర్య కోసం సంఘం యెరూషలేమునుండి అంతియొకయకు ఎవరిని పంపింది?
80➤ అంతియొకయలో దేవుని కృపను చూసి సంతోషించినదెవరు?
81➤ పరిశుద్ధాత్మతో, విశ్వాసముతో నిండిన సత్పురుషుడు ఎవరు?
82➤ సౌలును వెదకడానికి ఎక్కడనుండి బర్నబా తార్సుకు వెళ్ళాడు?
83➤ ఎక్కడ శిష్యులు మొట్టమొదటిసారి క్రైస్తవులుగా పిలువబడ్డారు?
84➤ భూలోకమంతటి గొప్ప కరువు రాబోతుందని ప్రవచించినదెవరు?
85➤ ఏ చక్రవర్తి కాలంలో భూలోకమంతట గొప్ప కరువు సంభవించింది?
86➤ మొదటి శతాబ్దంలో సంఘాన్ని హింసించడానికి తన చేతులను చాపిందెవరు?
87➤ హేరోదు రాజు చంపిన అపొస్తలుడు ఎవరు?
88➤ యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపినదెవరు?
89➤ అపొస్తలులలో మొదటి హతసాక్షి ఎవరు?
90➤ ఎవరికోసం సంఘం అత్యాశక్తితో దేవునికి ప్రార్థించింది?
91➤ పేతురు విడుదల కోసం ఎవరి ఇంట్లో సంఘం ఎడతెగక దేవునికి ప్రార్థించింది?
92➤ మార్కు అనే మారుపేరుగల యోహాను తల్లి ఎవరు?
93➤ పేతురు స్వరాన్ని గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయకుండా లోపలికి పరుగెత్తిన అమ్మాయి ఎవరు?
94➤ హేరోదు కోటనుండి పేతురు విడుదల పొందిన తరువాత హేరోదు ఎక్కడికి వెళ్ళి నివసించాడు?
95➤ హేరోదు రాజు అంతఃపురానికి పై విచారణకర్త ఎవరు?
96➤ ప్రభువు దూత మొత్తినందుకు పురుగులు పడి ప్రాణం విడిచిందెవరు?
97➤ సుమెయోను ప్రవక్తకు గల మరో పేరు ఏమిటి?
98➤ అంతియొకయ సంఘంలో కురేనీయుడైన ప్రవక్త ఎవరు?
99➤ చతుర్థాతిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన ప్రవక్త ఎవరు?
100➤ పరిచర్యకోసం సౌలు, బర్నబాలు ప్రత్యేకపరచబడినప్పుడు వారు ఎక్కడ ఉన్నారు?
101➤ అంతియొకయనుండి సౌలు, బర్నబాలు వెళ్ళిపోయిన తరువాత వారు దేవుని వాక్యాన్ని ఎక్కడ బోధించారు?
102➤ సౌలు, బర్నబాలకు ఉపచారం చేయు వ్యక్తి ఎవరు?
103➤ పాపు ఊరిలో ఉన్న అబద్ద ప్రవక్త ఎవరు?
104➤ బర్నబా, సౌలును పిలిపించి దేవుని వాక్యాన్ని విన్న అధిపతి ఎవరు?
105➤ బర్ యేసుకుగల మరో పేరు ఏమిటి?
106➤ సెర్గ్ పౌలు అధిపతిని విశ్వాసంనుండి తొలగించాలని ప్రయత్నించిన గారడివాడు ఎవరు?
107➤ మార్కు పౌలును విడిచి వచ్చిన ప్రాంతమేది?
108➤ దేవుని సంకల్పం చొప్పున తన స్వంత తరములో ప్రభువుకు సేవ చేసిందెవరు?
109➤ పౌలు, బర్నబాలు తమ పాద ధూళిని ఎక్కడ దులిపారు?
110➤ లుకయొనియలోని ప్రాముఖ్యమైన రెండు పట్టణాలు ఏమిటి?
111➤ ఎక్కడ పౌలు కుంటివాన్ని స్వస్థపరిచాడు?
112➤ లుకయోనియ ప్రజలు పౌలుకిచ్చిన పేరు ఏమిటి?
113➤ లుకయోనియ ప్రజలు బర్నబాను ఏమని పిలిచారు?
114➤ తమ వస్త్రాలను చింపుకొని సమూహంలోనికి చొరబడిన అపొస్తలుల పేర్లు ఏమిటి?
115➤ ఏ ఊరి ప్రజలు పౌలుమీద రాళ్ళు విసిరారు?
116➤ యెరూషలేమునుండి అంతియొకయకు పంపబడిన ఇద్దరు ప్రవక్తలు ఎవరు?
117➤ యూదాకు మారు పేరు ఏమిటి?
118➤ బర్నబా తనతోపాటు పరిచర్యకు ఎవరిని తీసుకెళ్ళాడు?
119➤ పౌలు తనతోపాటు పరిచర్యకు ఎవరిని తీసుకెళ్ళాడు?
120➤ తిమోతి స్వస్థలం ఏది?
121➤ లుస్త్రలో పౌలు ఎవరికి సున్నతి చేయించాడు?
122➤ ఎక్కడ వాక్యాన్ని చెప్పవద్దని పరిశుద్ధాత్ముడు పౌలును ఆటంకపరిచాడు?
123➤ పరిశుద్ధాత్ముడు పౌలును ఎక్కడికి వెళ్ళనియ్యలేదు?
124➤ నీవు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొన్న వ్యక్తి గురించి పౌలుకు కలిగిన దర్శనం ఏ స్థలానికి సంబంధించినది?
125➤ మాసిదోనియా గురించిన దర్శనం పౌలుకు కలిగినప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు?
126➤ ఏ ప్రాంతంలో పౌలు నదీ తీరాన వాక్యాన్ని బోధించాడు?
127➤ ఫిలిప్పీ పట్టణంలో మొదట యేసును అంగీకరించిన స్త్రీ ఎవరు?
128➤ దైవభక్తి కలిగి ఊదారంగు పొడిని అమ్మిన స్త్రీ ఎవరు?
129➤ లూదియ ఏ పట్టణస్థురాలు?
130➤ దయ్యంపట్టి సోదె చెబుతున్న అమ్మాయిని పౌలు ఎక్కడ స్వస్థపరిచాడు?
131➤ చెరసాలలో దేవునికి ప్రార్ధించి కీర్తనలు పాడింది ఎవరు?
132➤ జైలు అధికారి, అతని కుటుంబం యేసును స్వరక్షకునిగా అంగీకరించింది ఎక్కడ?
133➤ సుఖముగా వెళ్ళమని జైలు అధికారి ఎవరితో చెప్పాడు?
134➤ థెస్సలొనీకయలో పౌలును చేర్చుకొన్నది ఎవరు?
135➤ 'వీరు థెస్సలొనీకలో ఉన్నవారికంటె ఘనులైయుండిరి'. ఎవరు వారు?
136➤ ప్రతిదినం లేఖనాలను పరిశోధించినవారు ఎవరు?
137➤ పట్టణం విగ్రహాలతో నిండియుండుట చూసినందున ఎక్కడ పౌలు ఆత్మ పరితాపం చెందింది?
138➤ పౌలును వదరుబోతుగా పిలిచింది ఎవరు?
139➤ పౌలు ఏథెన్సులో ఏ సభలో ప్రసంగించాడు?
140➤ 'తెలియబడని దేవునికి' బలిపీఠాన్ని పౌలు ఎక్కడ చూశాడు?
141➤ ఏథెన్సులో క్రీస్తును విశ్వసించిన స్త్రీ ఎవరు?
142➤ యూదులందరు రోమా విడిచి వెళ్ళిపోవలెనని ఆజ్ఞాపించినదెవరు?
143➤ అకుల ఎక్కడ పుట్టాడు?
144➤ కొరింథు పట్టణంలో పౌలుతో పాటు డేరాలు కుట్టినవారు ఎవరు?
145➤ అన్య జనులకు అపొస్తలుడు ఎవరు?
146➤ కొరింథులో ఏ భక్తిపరుని ఇంటికి పౌలు వెళ్ళాడు?
147➤ తన కుటుంబమంతటితో ప్రభువునందు విశ్వసించిన సమాజ మందిర అధికారి పేరు ఏమిటి?
148➤ అకయకు అధిపతి ఎవరు?
149➤ దేవుని వాక్యానికి సంబంధించిన విషయాల్లో తీర్పరిగా ఉండనని చెప్పిందెవరు?
150➤ న్యాయపీఠం ఎదుట యూదులు పట్టుకొని కొట్టిన సమాజ మందిర అధికారి ఎవరు?
151➤ ఎక్కడ పౌలు తన తల వెండ్రుకలను కత్తిరించుకొన్నాడు?
152➤ పౌలు చేతులుంచినప్పుడు కొందరు భాషలతో మాట్లాడి, ప్రవచించింది ఎక్కడ?
153➤ ఏ పాఠశాలలో పౌలు అనుదినం తర్కించాడు?
154➤ చేతి రుమాలుతో లేక నడికట్లతో రోగులను ఏ అపొస్తలుడు స్వస్థపరిచాడు?
155➤ ఏ ప్రధాన యాజకుని కుమారులు దయ్యంతో గాయపరచబడి వేధించ బడ్డారు?
156➤ అర్తెమి దేవికి వెండి గుళ్ళను చేయించిన కంసాలి పేరు ఏమిటి?
157➤ ఎఫెసీ పట్టణంలో మహా దేవత ఎవరు?
158➤ చాలా సేపు పౌలు ప్రసంగించడంవలన నిద్రా భారంతో మూడవ అంతస్తు నుంచి క్రింద పడిన వ్యక్తి ఎవరు?
159➤ కైసరయ పట్టణంలో ఎవరి ఇంట్లో పౌలు గడిపాడు?
160➤ ప్రవక్తినిలుగా నలుగురు కన్యక కూతుళ్ళు ఎవరికున్నారు?
161➤ తన చేతులను, కాళ్ళను పౌలు బెల్టుతో బంధించుకొన్నదెవరు?
162➤ కిలికియ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైన పట్టణం ఏది?
163➤ ఎవరివద్ద పౌలు ధర్మశాస్త్రాన్ని నేర్చుకొన్నాడు?
164➤ పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షణ పొందినది ఎవరు?
165➤ 'సున్నము కొట్టిన గోడ' అని పౌలు ఎవరిని పిలిచాడు?
166➤ పౌలు స్వస్థలాన్ని గురించి అడిగి తెలుసుకొన్న అధిపతి ఎవరు?
167➤ పౌలు కలహాలు రేపువాడని ఎవరు చెప్పారు?
168➤ పౌలును విడిపించిన సహస్రాధిపతి ఎవరు?
169➤ క్రైస్తవ్యాన్ని గురించి ఎక్కువ జ్ఞానంగల అధిపతి ఎవరు?
170➤ ఫేలిక్సు భార్య ఎవరు?
171➤ పౌలునుండి తనకు డబ్బు (లంచం) వస్తుందని ఆశించి పౌలుతో మాటిమాటికి మాట్లాడిన అధిపతి ఎవరు?
172➤ అగ్రిప్ప రాజు సహోదరి ఎవరు?
173➤ ఫేస్తును దర్శించడానికి ఎవరు కైసరయకు వచ్చారు?
174➤ ఫేలిక్సు వదలి పెట్టిన ఖైదీ ఎవరు?
175➤ పౌలు ప్రసంగాన్ని వినాలని ఆశించిన రాజు ఎవరు?
176➤ ఏ భాషలో ప్రభువు సౌలుతో మాట్లాడాడు?
177➤ అతివిద్య వలన పౌలుకు పిచ్చి పట్టిందని ఎవరన్నారు?
178➤ 'ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూస్తున్నావా' అని పౌలుతో అన్న దెవరు?
179➤ ఔగుస్తు పటాలంలో శతాధిపతి ఎవరు?
180➤ ఫీనిక్సు రేవుకుగల మరో పేరు ఏమిటి?
181➤ ఏ సముద్రంలో పౌలు, ఇతరులు ఇటు అటు కొట్టుకొనిపోయారు?
182➤ ఏ ద్వీపంలో ఓడ ప్రమాదం నుండి పౌలు, ఇతరులు తప్పించుకొన్నారు?
183➤ పాము పౌలు చేతులను పట్టింది ఎక్కడ?
184➤ మెలితే ద్వీపంలో ముఖ్య పౌరుడు ఎవరు?
185➤ మెలితే ద్వీపంలో శీతాకాలంలో గడిపిన అలెక్సంద్రియ పట్టణ ఓడకుగల చిహ్నం ఏమిటి?
186➤ చివరికి ప్రత్యేకంగా ఉండటానికి పౌలు ఎక్కడికి పంపబడ్డాడు?
Comments
Post a Comment